Tilak Varma | పొట్టి సిరీస్‌కు దూరమైన తిలక్.. ప్రపంపచకప్ లోపు సుందర్ కోలుకునేనా..!
Team India : టీ20 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌ను హ్యాట్రిక్ విజయాలతో కైవసం చేసుకున్న భారత జట్టుకు షాకింగ్ న్యూస్. సర్జరీ కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్ వర్మ తిలక్ వర్మ (Tilak Varma) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు.
Team India : టీ20 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌ను హ్యాట్రిక్ విజయాలతో కైవసం చేసుకున్న భారత జట్టుకు షాకింగ్ న్యూస్. సర్జరీ కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్ వర్మ తిలక్ వర్మ (Tilak Varma) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. చివరి రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. న్యూజిలాండ్‌తో చివరి రెండు మ్యాచ్‌ల్లో సైతం తిలక్ ఆడడం లేదని సోమవారం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది. దాంతో.. ఆసియా కప్ హీరో స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ టీమ్‌తోనే ఉండనున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్ వర్మ జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకుంటున్న ఆసియా కప్ హీరో పునరాగమనం మరింత ఆలస్యం కానుంది. ‘ సర్జరీ నుంచి కోలుకున్న తిలక్ వ్యాయామాలు చేస్తున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిపుణుల పర్యవేక్షణలో అతడి రోజురోజుకు మెరుగవుతున్నాడు. అయితే.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు తిలక్‌కు మరికొంత సమయం పట్టనుంది. కాబట్టి.. అతడు చివరి రెండు టీ20లకు అందుబాటులో ఉండడు. ఫిబ్రవరి 3లోపు పూర్తిస్థాయిలో ఫిట్‌గా మారితే వామప్ మ్యాచ్, ప్రపంచకప్ కోసం భారత స్క్వాడ్‌తో కలుస్తాడు’ అని బీసీసీఐ వెల్లడించింది.
JUST IN: Tilak Varma is yet to regain full match-fitness and will miss the remaining T20Is against New Zealand.
He is expected to join India’s squad ahead of their T20 World Cup warm-up match. Shreyas Iyer will continue as Varma’s replacement for the #INDvNZ series pic.twitter.com/nPLImV027g
— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2026
తిలక్ బదులు మూడో స్థానంలో అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ చెలరేగుతున్నాడు. రాయ్‌పూర్‌లో మెరుపు అర్ధ శతకంతో విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు.. గువాహటిలో ఉన్నంత సేపు సిక్సర్లతో హోరెత్తించాడు. ఒకవేళ తిలక్ వర్మ ఫిట్నెస్ సాధించినా.. ఫామ్ దృష్ట్యా ఇషాన్‌కే వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కనుందని టాక్. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ఆరోగ్యంపై కూడా అప్డేట్ ఇచ్చింది భారత బోర్డు.
‘పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్న సుందర్ వైద్యలు సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆరోగ్యం మెరుగయ్యాక అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరుతాడు’ అని బీసీసీఐ తెలిపింది. వడోదర వన్డేలో గాయపడిన సుందర్ ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువకెరటం రవి బిష్ణోయను ఎంపిక చేశారు. తొలి రెండు మ్యాచుల్లో బెంచ్‌కే పరిమితమైన బిష్ణోయ్.. గువాహటిలో చెలరేగాడు. రెండు బిగ్ వికెట్లు తీసిన అతడు 18 పరుగులే ఇచ్చి కివీస్‌ను 153కే కట్టడి చేయడంలో కీలకమయ్యాడు.
🎥 𝗛𝗮𝗿𝗱 𝘄𝗼𝗿𝗸 𝗱𝗼𝗲𝘀𝗻’𝘁 𝘁𝗮𝗸𝗲 𝗮 𝗯𝗿𝗲𝗮𝗸 🙌
Focus 🔛 from #TeamIndia players in the nets right after a big win 💪#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/l7s3XmhzJD
— BCCI (@BCCI) January 26, 2026
టీ20 స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(తొలి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

