Tokyo Olympics: ఒలింపిక్స్‌కు కొత్త ప్రేక్షకుడు.. వీడియో క్లిప్ వైరల్

టోక్యో: ఇప్పుడంతా ఒలింపిక్స్ ( Tokyo Olympics ) టైమ్. పతకాలు ఎవరు గెలిచారన్నదే పెద్ద న్యూస్. ఇక కరోనా వేళ మహాక్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో స్టేడియాలు ప్రేక్షకులు లేకుండా వెలవెలబోతున్నాయి. క్రీడలు మహారంజుగానే సాగుతున్నా.. ప్రత్యక్షంగా చూసేవారు లేరు. కానీ అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఓ ప్రత్యేక అతిథి వచ్చారు. మహిళల మ్యాచ్ ను షూట్ చేస్తున్న అర్జెంటీ టీవీ ఛానల్ కెమెరామన్ .. మైదానంలో తిరుగుతున్న ఓ బొద్దింకను చూపించాడు. ఆటగాళ్ల నుంచి కెమెరాను మరో వైపు తిప్పుతూ.. ఆ గ్రౌండ్లో సంచరిస్తున్న బొద్దింకను లైవ్‌లో చూపించాడు. ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ క్లిప్ షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయ్యింది. ఆ పోస్టును 70 లక్షల మంది చూశారు. 65వేల రీట్వీట్లు వచ్చాయి. లైవ్‌లో ప్రసారం చేసిన ఆ బొద్దింక క్లిప్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. కానీ ఆ అతిథి మాత్రం ఆన్లైన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది.
— sati (@s6ntispam) July 26, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

