ఎదురులేని జొకో
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెర్బియా వీరుడు జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6-2, 6-1, 6-2తో అలెక్స్ డెమినార్పై విజయం సాధించాడు.
- ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్
మెల్బోర్న్: సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెర్బియా వీరుడు జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6-2, 6-1, 6-2తో అలెక్స్ డెమినార్పై విజయం సాధించాడు. తొలి సెట్ నుంచే ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ జొకోవిచ్.. 4 ఏస్‌లు సంధించి మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పాల్ 6-2, 4-6, 6-2, 7-5తో బటిస్టా అగట్పై, రుబ్లేవ్ 6-3, 3-6, 6-3, 4-6, 7-6 (11/9)తో రూన్‌పై, షెల్టన్ 6-7 (5/7), 6-2, 6-7 (4/7), 7-6 (7/4), 6-2తో వోల్ఫ్పై విజయాలు సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మహిళల విభాగంలో ప్లిస్కోవా 6-0, 6-4తో జాంగ్‌ను చిత్తు చేయగా.. ఐదో సీడ్ సబలెంక, లినెట్, వెకిక్ ముందంజ వేశారు.
క్వార్టర్స్‌లో సానియా జోడీ
కెరీర్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హైదరాబాదీ.. మిక్స్డ్ డబుల్స్‌లో ముందంజ వేసింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సానియా మీర్జా-రోహాన్ బోపన్న జంట 6-4, 7-6 (11/9)తో నినోమియా-బెహర్ ద్వయంపై గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

