Volleyball League | చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. గ్రూప్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో బ్లాక్‌హాక్స్ నాలుగో ఓటమి మూటగట్టుకుంది. గురువారం జరిగిన పోరులో హైదరాబాద్ 8-15, 8-15, 15-11, 18-20తో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ చేతిలో ఓడింది. బ్లాక్‌హాక్స్ కీలక ప్లేయర్లు హేమంత్, జోసెఫ్, లాల్ సుజన్ అంచనాలను అందుకోలేకపోయారు. కోల్‌కతా తరఫున వినీత్, అమిత్, కుకూర్లు ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బ్లాక్‌హాక్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. కోల్‌కతా ప్లేయర్ వినీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.