Women’s T20I cricket | టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన థాయ్లాండ్.. అతి తక్కువ లక్ష్యాన్ని డిఫెండ్ చేసిన జట్టుగా రికార్డు
Women's T20I cricket | మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో థాయ్లాండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని నెగ్గిన జట్టుగా థాయ్లాండ్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది.
బ్యాంకాక్: మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో థాయ్లాండ్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని నెగ్గిన జట్టుగా థాయ్లాండ్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఇవాళ బ్యాంకాక్లో థాయ్లాండ్, మలేషియా మహిళల జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన థాయ్లాండ్ జట్టు 18.3 ఓవర్లలో 53 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
దాంతో మలేషియా విజయం ఖాయమని అంతా భావించారు. కానీ థాయ్లాండ్ జట్టు మలేషియాకు ఆ అవకాశం ఇవ్వలేదు. థాయ్ బౌలర్ల ధాటికి మలేషియా టీమ్ 15.3 ఓవర్లలో 41 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. థాయ్లాండ్కు విజయం దక్కింది. కేవలం 53 పరుగులు చేసి ప్రత్యర్థిని ఆలోపే కట్టడి చేయడం ద్వారా ఇప్పటివరకు బంగ్లాదేశ పేరిట ఉన్న రికార్డును థాయ్లాండ్ తిరగరాసింది.
అతితక్కువ లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించిన జట్టుగా రికార్డు ఇప్పటివరకు బంగ్లాదేశ్ పేరిట ఉంది. 2012లో శ్రీలంకతో జరిగిన మహిళల టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 62 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత శ్రీలంకను 62 పరుగుల లోపే కట్టడి చేసి అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు ఈ రికార్డును థాయ్లాండ్ జట్టు తన పేరిట లిఖించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

