హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి డెన్మార్క్ మాస్టర్స్ టైటిల్ చేజిక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్‌తో కలిసి బరిలోకి దిగిన సిక్కిరెడ్డి..
ఆదివారం జరిగిన తుదిపోరులో 21-16, 21-17తో నాలుగో సీడ్ మాడ్స్ వెస్టర్‌గార్డ్-క్రిస్టియన్ బాష్ (డెన్మార్క్) ద్వయంపై ఘనవిజయం సాధించింది. సిక్కి-రోహన్‌కు జంటగా ఇది మూడో టైటిల్ కావడం విశేషం.