థీమ్ నిష్క్రమణ
- ఫెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
- జ్వెరెవ్ ముందంజ
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఆస్ట్రియా టెన్నిస్ స్టార్ డొమినిక్ థీమ్‌కు పరాభవం ఎదురైంది. తొలి రౌండ్లోనే చేదు ఫలితంతో థీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో థీమ్ 3-6, 2-6, 4-6 తేడాతో హ్యుగో డెల్లియన్ (బొలివియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అనవసర తప్పిదాలతో వరుసగా మూడు సెట్లను చేజార్చుకున్న థీమ్ తన ఖాతాలో వరుసగా పదో పరాజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఒక దశలో టాప్-3 స్థాయికి చేరేలా కనిపించిన థీమ్.. రోజు రోజుకు తీసికైట్టెన ఆట తీరుతో నిరాశ పరుస్తున్నాడు. ఒకానొక సమయంలో ప్రపంచ మూడో ర్యాంక్‌కు దూసుకొచ్చిన థీమ్ ప్రస్తుతం పేలవ ఆటతీరుతో 194వ స్థానానికి పడిపోయాడు. గతేడాది గాయపడ్డ థీమ్ ఆ తర్వాత లయ అందుకోలేకపోయాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-2, 6-4, 6-4తో ఒఫ్నర్ను చిత్తు చేశాడు. ప్రత్యర్థి నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో జ్వెరెవ్ వరుస సెట్లలో విజృంభించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దిమిత్రోవ్, జాన్ ఇస్నర్, స్వార్ట్మన్ ముందంజ వేయగా.. మహిళల సింగిల్స్‌లో సక్కరి, కనేపి, స్టిఫెన్స్ శుభారంభం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

