కుర్రాళ్లకు అడ్డుందా?
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా బుధవారం ఆతిథ్య జట్టుతో మూడో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తుగా ఓడించి పుంజుకున్న యువ భారత్..
- జోరు మీదున్న టీమ్ఇండియా
- జైస్వాల్, శాంసన్ రాకతో తుది జట్టు ఎంపికపై ఉత్కంఠ
- జింబాబ్వేతో నేడు మూడో టీ20
హరారే: జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా బుధవారం ఆతిథ్య జట్టుతో మూడో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తుగా ఓడించి పుంజుకున్న యువ భారత్.. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా బుధవారం జరుగబోయే మూడో పోరునూ గెలుచుకుని సిరీస్‌లో ముందంజ వేయాలని భావిస్తోంది. జింబాబ్వేతో పోల్చితే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌కు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే రాకతో తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారని ఆసక్తికరంగా మారింది.
జైస్వాల్ వస్తే తప్పుకునేదెవరు?
ఆలస్యంగా జింబాబ్వేకు వెళ్లిన జైస్వాల్, శాంసన్, దూబే రాకతో గిల్‌కు కొత్త తలనొప్పి ఎదురైంది. జైస్వాల్ రావడంతో గిల్‌తో జతగా ఓపెనర్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరం. ఆడిన తొలి మ్యాచ్‌లో విఫలమైనా రెండో మ్యాచ్‌తోనే భారీ శతకం బాదిన అభిషేక్ శర్మను తప్పించే సాహసం అయితే గిల్ చేయకపోవచ్చు. ఇద్దర్నీ ఆడించాల్సి వస్తే వారు ఏ స్థానాల్లో బ్యాటింగ్ వస్తారనేది చూడాలి. వికెట్ కీపర్ జురెల్ స్థానంలో సీనియర్ ప్లేయర్ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. పరాగ్ స్థానాన్ని దూబే భర్తీ చేయొచ్చు. గత రెండు మ్యాచ్‌లలోనూ అదరగొట్టడంతో బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
జింబాబ్వే పుంజుకునేనా?
మొదటి టీ20లో పర్యాటక జట్టుకు అనూహ్య షాకిచ్చిన జింబాబ్వే రెండో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోగా బ్యాటర్లూ చేతులెత్తేయడంతో ఆ జట్టు భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. కెప్టెన్ సికందర్ రజా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

