Team India New Jersey | కరేబియన్ దీవుల్లో ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నది. భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ భాగస్వామి అయిన అడిడాస్ కొత్త జెర్సీని విడుదల చేసింది. భారత జట్టులోని ఆటగాళ్లందరూ కొత్త జెర్సీతో ఫొటోషూట్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. పలువురు క్రికెటర్లు సైతం కొత్త జెర్సీలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త జెర్సీలో భారత జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనున్నది.
అలాగే ఆస్ట్రేలియా, ఆసియా క్రీడల్లోనూ టీమిండియా అదే జెర్సీతో కనిపించనున్నది. లేత నీలం రంగు జెర్సీలో కొన్ని ముదురు నీలం గీతలు ఉండగా.. అలాగే ఎడమవైపున బీసీసీఐ లోగో ఉండేలా డిజైన్ చేశారు. అలాగే జట్టు స్పాన్సర్ డ్రీమ్ 11 పేరుతో పాటు పేరును సైతం జెర్సీ ముందు భాగంలో ఉండేలా ఏర్పాటు చేశారు. అడిడాస్ లోగో ఛాతీకి కుడి వైపున ఉంటుంది. జెర్సీపై రెండు వైపులా మూడు తెల్లటి చారల మారిదిగా స్ట్రిప్స్ ఉండగా.. కాలర్, స్లీవ్స్‌లో ఆరెంజ్ కలర్‌తో డిజైన్ చేశారు. టెస్టుల సందర్భంగా విడుదల చేసిన జెర్సీపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ‘డ్రీమ్ ఎలెవన్’ పెద్దగా ముద్రించడం, దేశం పేరును తొలగించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
మొదటి వన్డే: జూలై 27, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
రెండో వన్డే: జూలై 29, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
మూడో వన్డే: ఆగస్టు 1, బ్రియాన్ లారా స్టేడియం, ట్రినిడాడ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ఉజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్.
షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), ఎలిక్ అథానాజే, యానిక్ కారియా, కేసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోతీ, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, ఓసీ థామస్ సింక్లెయిర్.
Test Cricket ✅
On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw
— BCCI (@BCCI) July 26, 2023