Home
Sports
Tarvis Head Hit Fastest Half Century In Worldcup Warner Also Scores Half Century Against New Zealand
Tarvis Head: ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. కివీస్ బౌలర్లను ఉతికారేస్తున్న ఆసీస్ ఓపెనర్లు
Tarvis Head : వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ట్రావిస్ హెడ్. అతను 25 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు. ఇదే వరల్డ్‌కప్‌లో లంక బ్యాటర్ మెండీస్ కూడా 25 బంతుల్లో 50 చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోతున్నారు.
ధర్మశాల: ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. కివీస్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్.. బౌండరీల మోత మోగిస్తున్నారు. వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 25 బంతుల్లోనే అతను అర్థశతకం చేశాడు. దాంట్లో నాలుగు సిక్సర్లు, ఆరు బౌండరీలు ఉన్నాయి. మరో ఓపెనర్ వార్నర్ కూడా పవర్ షాట్స్‌తో కేకపుట్టిస్తున్నాడు. వార్నర్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీ చేరింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 144 రన్స్ చేసింది. వార్నర్ 69, ట్రావిస్ 71 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

