Tajinderpal Singh : భారత స్టార్ షాట్ఫుటర్(shot-putter) తేజిందర్‌పాల్ సింగ్ తూర్(Tajinderpal Singh Toor) సంచలనం సృష్టించాడు. ఒకేసారి ఆసియా, జాతీయ స్థాయి రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(National Inter-State Senior Athletics Championships)లో అతను ఈ ఫీట్ సాధించాడు.
భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో అతను షాట్ పుట్‌ను ఏకంగా 21.77 మీటర్ల దూరం విసిరాడు. దాంతో, ఆగస్టు నెలలో బుడాపెస్ట్(Budapest)లో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్(World Athletics Championships 2023) పోటీలకు అర్హత సాధించాడు.
తేజిందర్‌పాల్ సింగ్ రెండేళ్లలో తన రికార్డు తానే బ్రేక్ చేశాడు. షాట్‌పుట్‌ను 21.77 మీటర్ల దూరం విసిరి గతంలో తాను నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 2021లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4 తేజిందర్‌పాల్ విసిరిన షాట్‌పుట్ 21.49 మీటర్ల దూరం పడింది. ఈ పోటీల్లో స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్(Murali Sreeshankar) సత్తా చాటాడు. క్వాలిఫైయింగ్ రౌండ్లో మొదటి ప్రయత్నంలోనే 8.41 మీటర్ల ఎత్తు దూకాడు. దాంతో జెస్విన్ అల్డ్రిన్(Jeswin Aldrin) ఈ ఏడాది నెలకొల్పిన 8.42 జాతీయ రికార్డుకు ఒక్క సెంటీ మీటర్ దూరంలో ఆగిపోయాడు.