T20 Worldcup 2022 | టీ20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్.. పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
పొట్టి ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్... ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలుపు
టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీ విజేతగా ఇంగ్లండ్ జట్టు నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లోపాకిస్థాన్ జట్టు మీద ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి మొయిన్ ఆలీ (13 బంతుల్లో 19 పరుగులు) అండగా నిలిచాడు. చెలరేగి ఆడి ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెన్‌స్టోక్స్ విన్నింగ్ షాట్ కొట్టడంతో ఇంగ్లండ్ డగౌట్లో సంబరాలు మొదలయ్యాయి. ఫైనల్లో గెలవడంతో రెండోసారి టీ 20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది. 2010 లో ఇంగ్లండ్ పొట్టిప్రపంచకప్ విజేతగా నిలిచింది. పొట్టి ప్రపంచకప్ గెలుపొందిన ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ శుభాకాంక్షలు తెలిపాయి.
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ హేల్స్ వికెట్ కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రీది, మొహమ్మద్ వాసీంలు తలా ఒక వికెట్ తీశారు.
బెన్‌స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్
వరల్డ్ కప్ ఫైనల్లో బెన్‌స్టోక్స్ ఒత్తిడిలో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. అర్థసెంచరీతో చెలరేగి జట్టుని గెలిపించాడు. మొయిన్ ఆలీతో కలిసి ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. వసీం 19వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి, సంబరాలు చేసుకున్నాడు. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ మీద కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుని గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్లో14 పరుగులు చేసి, సూపర్ ఓవర్‌కి తీసుకెళ్లాడు. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. దాంతో తమ జట్టు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ కలని బెన్‌స్టోక్స్ నెరవేర్చాడు.
షాన్ మసూద్ టాప్ స్కోరర్
టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 15 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ బాబర్ ఆజం (32 పరుగులు), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాంతో, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 137 పరుగులు చేసింది కోల్పోయింది. షాన్ మసూద్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్‌కి ఒక వికెట్ దక్కింది.
WHAT A WIN! 🎉
England are the new #T20WorldCup champions! 🤩#PAKvENG | #T20WorldCupFinal | 📝 https://t.co/HdpneOINqo pic.twitter.com/qK3WPai1Ck
— ICC (@ICC) November 13, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

