FIFA World Cup | వరసగా నాలుగోసారి 16వ రౌండ్‌కు స్విట్జర్లాండ్.. అల్జీరియా ఖేల్‌ఖతం..!
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్ 2026 నాకౌట్ దశలో స్విట్జర్లాండ్(Switzerland) దుమ్మురేపింది. ఉత్కంఠ రేపిన 32వ రౌండ్లో సాంకేతికంగా బలమైన అల్జీరియా(Algeria)ను చిత్తుగా ఓడించింది.
FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్ 2026 నాకౌట్ దశలో స్విట్జర్లాండ్(Switzerland) దుమ్మురేపింది. ఉత్కంఠ రేపిన 32వ రౌండ్లో సాంకేతికంగా బలమైన అల్జీరియా(Algeria)ను చిత్తుగా ఓడించింది. ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 2-0తో గెలుపొందిన స్విస్ టీమ్ 16వ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగోసారి స్విట్జర్లాండ్ ఈ రౌండ్లో ప్రవేశించింది.
స్విట్జర్లాండ్ జట్టు 16వ రౌండ్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన 32వ రౌండ్లో అల్జీరియాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన స్వీస్ టీమ్ 2-0తో ముందంజ వేసింది. మెగా టోర్నీలో గొప్పగా రాణిస్తున్న అల్జీరియా వ్యూహాల్ని స్విట్జర్లాండ్ సమర్ధంగా తిప్పికొట్టింది.
🎟️ Switzerland punches its ticket to the Round of 16!#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) July 3, 2026
ఆట మొదలైన 10వ నిమిషంలోనే జోహన్ మన్జాంబి గోల్ అందించాడు. అల్జీరియా ఆటగాళ్ల నుంచి చాకచక్యంగా బంతిని తప్పించిన జోహన్.. ఎడమవైపు నుంచి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. రెండో అర్ధ భాగం ఆరంభంలోనే డాన్ డోయో మరో గోల్ కొట్టగా స్విట్జర్లాండ్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఊహించని ఓటమితో అట్లాస్ లయన్స్ ఇంటిదారి పట్టగా.. ఆ జట్టు కెప్టెన్ రియాజ్ మహ్రేజ్ అంతర్జాతీయ కెరీర్ సైతం ముగిసినట్టైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

