Indian Wells : టాప్ సీడ్ ఇగా స్వియాటెక్(Iga Swiatek) ఇండియన్ వెల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో ఉక్రెయిన్ స్టార్ మర్టా కస్త్యుక్(Marta Kostyuk)ను చిత్తుగా ఓడించింది. వరుస సెట్లలో జోరు చూపించిన స్వియాటెక్ 6-2, 6-1తో మర్టాను మట్టికరిపించింది. దాంతో, రెండోసారి ఇండియన్ వెల్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. మొత్తంగా ఈ పోలాండ్ స్టార్‌కు ఇది పదో డబ్ల్యూటీఏ ఫైనల్ కావడం విశేషం.
టైటిల్ పోరులో ఆమె అమెరికా సంచలనం కొకో గాఫ్(Coco Gauff), మరియా సక్కారీ(Maria Sakkari) మ్యాజ్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది. స్వియాటెక్ 2022లో తొలిసారి ఇండియన్ వెల్స్ చాంపియన్‌గా అవతరించింది.
She is 𝐢𝐧𝐞𝐯𝐢𝐭𝐚𝐛𝐥𝐞.@iga_swiatek reaches a 10th WTA 1000 final 🔟⭐️#TennisParadise pic.twitter.com/iryl8Bikw2
— wta (@WTA) March 16, 2024
‘ఈ టోర్నీలో నా ఆట తీరుపట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నా. ఈ రోజు నేను ఆడిన మ్యాచ్ అద్భుతం. ఈ టోర్నమెంట్ చాలా గొప్పగా సాగుతోంది. ఇక గాఫ్‌తో టైటిల్ పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇద్దరికీ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు అడిన అనుభవం ఉంది. ఫైనల్ ఫైట్ ఇద్దరికీ కష్టంగానే ఉంటుందని భావిస్తున్నా’ అని మ్యాచ్ అనంతరం స్వియాటెక్ అంది.