Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
Suryakumar Yadav : భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కొత్త ఇల్లు కొన్నాడు. స్వదేశంలో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన అతడు దుబాయ్‌లో విలాసవంతమైన ఇల్లు తీసుకున్నాడు.
Suryakumar Yadav : భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కొత్త ఇల్లు కొన్నాడు. స్వదేశంలో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన అతడు దుబాయ్‌లో విలాసవంతమైన ఇల్లు తీసుకున్నాడు. తమ ఇంటికి సంబంధించిన కాగితాలపై భార్య దివిశ శెట్టి సమక్షంలో సంతకం చేసిన సూర్య.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన న్యూ హోమ్ వీడియో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు దుబాయ్‌లో ఇల్లు కొనడానికి గల కారణాలను వెల్లడించాడు.
టీమిండియాను టీ20ల్లో అజేయశక్తిగా మలిచిన సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరమయ్యాక అడపాదడపా మీడియా కంటపడుతున్నాడు. తనను సారథిగా తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసిందని వాపోయిన సూర్య.. తాజాగా దుబాయ్‌లో ఇల్లు కొన్నాడు. స్థానికంగా పాపులరైన ‘షారుక్రెసిడెన్సీ’కి చెందిన ‘దనుబే ప్రాపర్టీస్’లో అతడు సకల వసతులు, హంగులతో కూడిన విలాసవంతమైన ఇల్లుకు యజమాని అయ్యాడు. ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం దుబాయ్‌కు రావడంతో.. ఆ సిటీపై ఇష్టం ఏర్పడిందని పేర్కొన్న మాజీ సారథి.. ఇక్కడి జీవన విధానం, మెరుగైన ప్రమాణాలు నచ్చడంతోనే ఇల్లు తీసుకున్నాని చెప్పాడు.
సూర్య, దివిశ దంపతులకు వారి కొత్త ఇంటి దస్త్రాలు అందజేసిన అనంతరం దనుబే ప్రాపర్టీస్ ప్రతినిధి మీరు ఎందుకు దుబాయ్‌లో ఇల్లు తీసుకున్నారు? అని అడుగుతాడు. ‘నేను తొలిసారి 2014లో మళ్లీ 2020లో ఇక్కడకు వచ్చా. భారతీయులు దుబాయ్‌వైపు చూస్తున్నారు. విలాసవంతమైన ఇల్లు మాత్రమే కాదు ప్రమాణాలతో కూడిన జీవితం ఇక్కడి ప్రత్యేకత. ముంబైలోనూ సురక్షితంగానే ఉండేది. భద్రతా పరంగా దుబాయ్ అద్భుతం. ఇక్కడకు రావడం నాకు చాలా సౌకర్యంగా, సంతోషంగా ఉంది అని సూర్య తెలిపాడు. ఈ వీడియోకి.. షారుక్రెసిడెన్సీకి సంబంధించిన దనుబేలో పెట్టుబడి పెట్టిన విషయాన్ని మీతో పంచుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.
దుబాయ్‌లోని సముద్రతీర పట్టణంలో విలాసవంతమైన ఇల్లు తీసుకున్నా. నలభైకి పైగా ఉన్న ప్రీమియం సౌకర్యాలలో లాంగెవిటీ లాంజ్ నాకు చాలా నచ్చింది. మామూలుగా నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులో ఇది ఉండదు. నేను ఇక్కడ ఇల్లు తీసుకున్నందున.. మీరు ఎందుకు దనుబే ప్రాపర్టీస్‌లో చేరకూడదు. నాకు ఇరుగుపొరుగు అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. జీవితాన్ని రాజు స్టయిల్లో జీవించండి’ అంటూ సూర్య రాసుకొచ్చాడు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇంటికి పక్కనే స్కై తీసుకున్న హౌస్ ఉంది. దాంతో.. షారుక్ సహ యజమానిగా ఉన్న ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఒకప్పుడు సూర్య ఆడిన విషయం తెలిసిందే. అయితే.. టీమిండియాకు దూరమైన అతడు దుబాయ్‌లో ఇల్లు కొనడంతో అక్కడే సెటిలైపోతాడా? విదేశీ లీగ్స్‌లో ఆడతాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

