Suresh Raina : ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
Suresh Raina : ది జరిగిన కాస్సేపటికే మరో క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కూడా తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. చెన్నైలోని చైన్నై సూపర్‌కింగ్స్ క్యాంప్‌లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలు వెలువడ్డాయి...

అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి ఇవాల్టికి సరిగ్గా ఏడాది గడిచింది. ఆగస్ట్ 15 వ తేదీ నాడు ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇది జరిగిన కాస్సేపటికే మరో క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) కూడా తన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. చెన్నైలోని చైన్నై సూపర్‌కింగ్స్ క్యాంప్‌లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలు వెలువడ్డాయి. ధోనీ తన 15 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్లో 90 టెస్ట్‌లు, 350 వన్డేలు, 98 టీ20 లు ఆడారు. కాగా, సురేశ్ రైనా తన 14 ఏండ్ల కెరీర్లో 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20లు, 200 ఐపీఎల్ మ్యాచులు ఆడారు. అయితే, ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే తాను కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటన చేయడంపై సీక్రేట్స్ ఏవీ లేవని.. అసలెందుకు అలా ప్రకటించాల్సి వచ్చిందో ఇన్నాళ్లకు రైనా తెలిపాడు.
‘రిటైర్మెంట్ ప్రకటన చేయాలని ముందుగానే ఇద్దరమూ కూడబలుక్కుని నిర్ణయం తీసుకున్నాం. అందుకు తగినట్లుగా మా మెదడును మలుచుకున్నాం. ధోనీ జెర్సీ నంబర్ 7.. నా జెర్సీ నంబర్ 3. ఇద్దరి నంబర్లు ఒకచోట చేరిస్తే 73. అప్పుడు 73 స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినందున 73 నంబర్‌కు విశ్రాంతి కల్పిస్తే బాగుంటుందనుకున్నాం. అలాగే సరిగ్గా 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ధోనీ, నేనూ రిటైర్మెంట్ ప్రకటన చేశాం’ అని సురేశ్ రైనా చెప్పారు. ‘ధోనీ తన కెరీర్‌ను 2004 డిసెంబర్ 23 న ప్రారంభించగా.. ఆరు నెలలు ఆలస్యంగా నేను జట్టులోకి వచ్చాను. అంతర్జాతీయ క్రికెట్‌ను ఇద్దరం కలిసి దాదాపు ఒకేసారి ప్రారంభించినందున మా ఇద్దరిలో స్నేహం పెరిగింది. రిటైర్ తీసుకున్న తర్వాత సీఎస్కేలో కూడా కలిసే ఉన్నాం. అంతర్జాతీయ కెరీర్ ముగిసినా.. ఐపీఎల్లో మాత్రం ఇద్దరం కలిసే ఆడతాం’ అని రైనా చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
లండన్‌లో క్రికెటర్ల జెండా పండుగ
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
ఢిల్లీలోని హోటల్లో మంటలు.. ఇద్దరు మృతి
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్‌కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

