Sumit Nagal | మాంటెకార్లో మాస్టర్స్‌లో పోరాడి ఓడిన నాగల్
ప్రతిష్టాత్మక ఏటీపీ మాంటెకార్లో మాస్టర్స్‌లో భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నాగల్ రెండో రౌండ్లో పోరాడి ఓడాడు. బుధవారం వర్షం కారణంగా గురువారానికి వాయిదా పడ్డ మ్యాచ్‌లో నాగల్ 3-6, 6-3, 2-6 తేడాతో ఏడో సీడ్ హోల్గర్ రూన్ చేతిలో ఓడిపోయాడు. బుధవారం నాటి ఆటలో ఒక సెట్ కోల్పోయినా నాగల్ అద్భుతంగా పుంజుకుని రెండో సెట్ గెలుచుకున్నాడు.
Sumit Nagal | మాంటెకార్లో: ప్రతిష్టాత్మక ఏటీపీ మాంటెకార్లో మాస్టర్స్‌లో భారత టెన్నిస్ సంచలనం సుమిత్ నాగల్ రెండో రౌండ్లో పోరాడి ఓడాడు. బుధవారం వర్షం కారణంగా గురువారానికి వాయిదా పడ్డ మ్యాచ్‌లో నాగల్ 3-6, 6-3, 2-6 తేడాతో ఏడో సీడ్ హోల్గర్ రూన్ చేతిలో ఓడిపోయాడు. బుధవారం నాటి ఆటలో ఒక సెట్ కోల్పోయినా నాగల్ అద్భుతంగా పుంజుకుని రెండో సెట్ గెలుచుకున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో రెండు సార్లు తన సర్వీస్‌ను కోల్పోవడంతో నాగల్‌కు పరాభవం తప్పలేదు.
ఈ టోర్నీలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ 7-5, 6-3 తేడాతో అన్‌సీడెడ్ లొరెంజో ముసెట్టిపై అలవోక విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో అగ్రశ్రేణి ఆటగాడు డానియల్ మెద్వెదెవ్ 3-6, 7-5 తేడాతో రష్యాకే చెందిన 15వ సీడ్ కరెన్ ఖచనోవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 5-7, 6-7 (3/7) తేడాతో గ్రీక్ ఆటగాడు సిట్సిపస్ చేతిలో చిత్తయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

