Australian Open | రెండో రౌండ్లోనే నాగల్ ఇంటికి.. బోపన్న జోడీ ముందంజ
Australian Open : ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open)లో భారత యువ కెరటం సుమిత్ నాగల్(Sumit Nagal) పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో సీడెడ్ ఆటగాడికి షాకిచ్చిన నాగల్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు
Australian Open : ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open)లో భారత యువ కెరటం సుమిత్ నాగల్ (Sumit Nagal) పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో సీడెడ్ ఆటగాడికి షాకిచ్చిన నాగల్ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన జున్చెన్ షాంగ్(Juncheng Shang) ధాటికి చేతులెత్తేశాడు. తొలి సెట్ గెలుపొందిన నాగల్ ఆ తర్వాత ప్రభావం చూపలేకపోయాడు.
చివరి మూడు సెట్లలో జోరు చూపించిన షాంగ్ 2-6, 6-3, 7-5, 6-4తో గెలుపొందాడు. దాంతో, నాగల్ నిరాశగా ఇంటిదారి పట్టాడు. మరోవైపు రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్బెన్ జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. జేమ్స్ డక్‌వర్త్, మార్క్ పొల్మనస్ ద్వయంపై అద్భుత విజయం సాధించింది.
What an atmosphere on Court 13!
Jungcheng Shang advances to the third round of a Grand Slam for the first time in his career, defeating a gallant Sumit Nagal 2-6 6-3 7-5 6-4 🙌#AusOpen #AO2024 pic.twitter.com/GM3AyqUk0W
— #AusOpen (@AustralianOpen) January 18, 2024
వైల్డ్ కార్డ్ ద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్()లో ఎంట్రీ ఇచ్చిన నాగల్ తొలి రౌండ్లో కజకిస్థాన్ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్(Alexander Bublik)పై గెలుపొందాడు. 31వ ర్యాంకర్ నాగల్ 6-4, 6-2, 7-6తో బబ్లిక్‌ను చిత్తు చేశాడు. దాంతో, మూడేండ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నాగల్ రికార్డు నెలకొల్పాడు. 1988లో రమేశ్ కృష్ణన్(Ramesh Krishnana) తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. అయితే.. మూడో రౌండ్‌కు చేరితే ప్రకాశ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా నాగల్ మరో రికార్డు సృష్టించేవాడు.
ఇవి కూడా చదవండి
- Shamar Joseph | తొలి బంతికే వికెట్.. ఆపై ఐదు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు
- Tirumala | శ్రీవారి దర్శనానికి 28 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- 12th Fail | గొప్ప సినిమా అనేది కథ నుంచే వస్తుంది.. 12th ఫెయిల్‌పై ఆనంద్ మహీంద్రా రివ్యూ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

