Steve Smith : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. 29 సెంచరీలతో లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. పెర్త్‌లో వెస్డిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్ సెంచరీ చేశాడు. 175 బంతుల్లో 9 ఫోర్లతో వంద పరుగులకు చేరువయ్యాడు. ఇది టెస్టుల్లో అతనికి 29వ శతకం. దాంతో బ్రాడ్‌మన్ తర్వాత ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా స్మిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. 115 ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను డబుల్ సెంచరీ కొట్టాడు. మార్నస్ లబుషేన్ కూడా 204 రన్స్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 598-4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఆసీస్ తరఫున మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేశాడు. అతను 41 సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. 32 శతకాలతో స్టీవ్ వా రెండో స్థానంలో నిలిచాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది.