AUSvBAN: ఆరేసిన స్టార్క్, ఇస్లామ్.. తొలి రోజే కూలిన 18 వికెట్లు
AUSvBAN: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో.. తొలి రోజే 18 వికెట్లు పడ్డాయి. తొలుత బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌట్ అవ్వగా, ఇక ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. ఆసీస్ బౌలర్ స్టార్క్, బంగ్లా బౌలర్ ఇస్లామ్ .. ఆరేసి వికెట్లు తీసుకున్నారు.
మాకే: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు(AUSvBAN) తొలి రోజే 18 వికెట్లు పడ్డాయి. తొలుత బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌట్ అవ్వగా, ఇక ఆస్ట్రేలియా కూడా ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా ఉన్నది. ఇవాళ ఉదయం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నది. ప్యాట్ కమ్మిన్స్ డిసెషన్కు తగినట్లుగా ఓపెనింగ్ బౌలర్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. తొలి బంతికే షాద్మాన్ ఇస్లామ్ వికెట్ తీశాడు. అదే ఊపులో బౌలింగ్ చేసిన స్టార్క్ 10 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు.
ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా మాకే పిచ్‌పై తడబడ్డారు. బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ నిప్పులు చెరిగాడు. అతను 35 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. ఆసీస్ బ్యాటర్ కెమరూన్ గ్రీన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 51 రన్స్‌తో అతను ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లను మార్చాలని వత్తిడి వచ్చినా.. కేవలం ఒక్క ప్లేయర్‌ను మాత్రమే మార్చారు.బంగ్లాదేశ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా, ఇండియా, ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా టూర్ చేయనున్నది.
Absolute mayhem to start in Mackay!
Catch the #AUSvBAN day one match report: https://t.co/RjHruJ4mKw pic.twitter.com/iib6nYWHzQ
— cricket.com.au (@cricketcomau) August 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

