AUS vs BAN | స్టార్క్ ధాటికి బంగ్లా విలవిల.. 64 పరుగులకే ఆలౌట్..!
AUS vs BAN : ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో తేలిపోయింది. తొలి సెషన్ మొదలైందో లేదో మిచెల్ స్టార్క్(6-12) నిప్పులు చెరగడంతో బంగ్లా కుప్పకూలింది.
AUS vs BAN : ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో తేలిపోయింది. తొలి సెషన్ మొదలైందో లేదో మిచెల్ స్టార్క్(6-12) నిప్పులు చెరగడంతో 12 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేదు. మరో ఎండ్‌లో కమిన్స్(3-25) సైతం చెలరేగగా లంచ్ తర్వాత పర్యాటక జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. సంచలన బౌలింగ్‌తో స్టార్క్ బెంబేలెత్తించగా 64 పరుగులకే బంగ్లా కుప్పకూలింది.
డార్విన్ టెస్టులో ఓటమితో రగిలిపోతున్న ఆస్ట్రేలియా పంజా విసిరింది. మెక్‌కేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను మిచెల్ స్టార్క్(6-12) ఆదిలోనే గట్టిదెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ షద్మాన్ ఇస్లాం(0)ను ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో వరస బంతుల్లో గత మ్యాచ్ సెంచరీ హీరో తంజిద్ హసన్(0), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(0)లను వెనక్కి పంపాడు స్టార్క్.
A wicket first-ball from Mitchell Starc set the tone for Australia’s domination https://t.co/er1eeItXeu #AUSvBAN pic.twitter.com/al3f8xjn8R
— Cricinfo (@cricinfo) August 22, 2026
మెయిడెన్ ఓవర్లతో బంగ్లాను బెంబేలెత్తించిన ఈ స్పీడ్‌స్టర్ కాసేపటికే మొమినుల్ హక్(9), లిటన్ దాస్(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో, చూస్తుండగానే 12 పరుగులకే సగం మంది బ్యాటర్లు వెనుదిరిగారు. వీరిలో నలుగురు డకౌటయ్యారు. అనంతరం కమిన్స్(3-25) ఓవర్లో ముష్ఫికర్ రహీం(5) ఔటవ్వగా ఆరో వికెట్ కోల్పోయింది పర్యాటక జట్టు.
అనంతరం మెహిది హసన్ మిరాజ్(4), హసన్ మహమూద్(3)లు ఆచితూచి ఆడగా 35\6తో లంచ్‌కు వెళ్లింది బంగ్లా. కానీ కమిన్స్ మరో ఎండ్ నుంచి వికెట్లు తీయగా.. 64 పరుగులకే బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమవ్వగా.. పదో నంబర్ బ్యాటర్ షొరిఫుల్ ఇస్లాం 14 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Five in no time for Starc ⚡️
(via @cricketcomau) pic.twitter.com/Bsj5iWklyS
— Cricinfo (@cricinfo) August 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

