స్పెయిన్: స్టార్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ స్పానిష్ గ్రాండ్ ప్రి టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫార్ములా వన్ రేస్‌ను పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన వెర్స్టాపెన్ వాయువేగంతో దూసుకెళ్లాడు. ఒక గంటా 27 నిమిషాల 57.94 సెకన్లలో ఈ రెడ్‌బుల్ డ్రైవర్ రేసును ముగించగా..
లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), రస్సెల్ (మెర్సిడెస్) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. ఈ రేసుతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకున్న వెర్స్టాపెన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరిం త పటిష్ట పరుచుకున్నాడు.