మోన్జా (ఇటలీ): స్టార్ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ సీజన్లో ఎదురు లేకుండా సాగుతున్న వెర్స్టాపెన్ ఫార్ములావన్ ట్రాక్‌పై వరుసగా పదో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు.
ఆదివారం జరిగిన ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ డ్రైవర్ గంటా 13 నిమిషాలా 41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. పెరెజ్ (రెడ్‌బుల్), సెయింజ్ (ఫెరారీ) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.