భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2) స్వల్ప స్కోరుకే వెనుతిరిగాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లెంగ్త్ బాల్‌ను ఆడటానికి ప్రయత్నించిన్ విలియమ్సన్.. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది.
డైవ్ చేస్తూ దాన్ని అందుకోవడానికి సంజూ శాంసన్ ప్రయత్నించాడు. కానీ అతని చేతుల్లో నుంచి బంతి జారిపోయింది. అయితే స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న దేవదత్ పడిక్కల్ బంతి కింద పడకముందే అందుకున్నాడు. అయితే క్యాచ్ సరిగా క్యారీ అయిందా? లేదా? అనే అనుమానంతో థర్డ్ అంపైర్‌ను ఫీల్డ్ అంపైర్ అడిగాడు.
రిప్లేలో బంతిని పడిక్కల్ సరిగా క్యారీ చేయనట్లు కనిపిస్తున్నా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అని ప్రకటించాడు. దీంతో విలియమ్సన్ మైదానం వీడాల్సి వచ్చింది. రెండు ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు 3/1తో కష్టాల్లో నిలిచింది.
How was that out?#IPL2022#SRHvsRR #SRHvRR pic.twitter.com/Pnh6DFjj5S
— 𝚅𝙸𝚂𝙷𝙰𝙻 (@CricLoverVishal) March 29, 2022