RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరు మరికాసేపట్లో మొదలవ్వనుంది. దాదాపు పది నెలలకు క్రికెట్ మ్యాచ్‌ల ఊసేలేని చిన్నస్వామి స్టేడియంలో మరో 30 నిమిషాల్లో వేసివి క్రీడా వినోదానికి తెరలేవనుంది. ఆరంభ వేడుకలు లేకుండానే జరుగుతున్న తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
పవర్ హిట్టర్లతో నిండిన ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఆరంభ పోరులో తలపడుతున్నాయి. బ్యాటింగ్‌లో తిరుగులేని ఆరెంజ్ ఆర్మీని బంతితో కట్టడి చేయాలని బెంగళూరు కెప్టెన్ బౌలింగ్ తీసుకున్నాడు. గతంలో ఆర్సీబీపై వైల్డ్ ఫైర్ ఆటతో ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ స్కోర్ బాదేసిన హైదరాబాద్ ఈసారి చెలరేగిపోవాలనుకుంటోంది.
Rajat Patidar 🆚 Ishan Kishan
Are you ready for a blockbuster #TATAIPL 2026 opener? 🍿#KhelBindaas | #RCBvSRH pic.twitter.com/jRpfldwsSi
— IndianPremierLeague (@IPL) March 28, 2026
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లో విజయంతో టోర్నీని ఆరంభించాలని ఆర్సీబీ కసితో ఉంది. సో.. రెండుజట్ల మధ్య రసవత్తర పోరు అభిమానులకు అదిరిపోయే క్రీడా వినోదం పంచడం ఖాయం.
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, అభినందన్ సింగ్, జాకబ్ డఫ్ఫీ, సుయాశ్ శర్మ.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ – సన్‌రైజర్స్ : శివంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, డేవిడ్ పైనే, స్మరన్ రవిచంద్రన్, షకీబ్ హుస్సేన్.
ఆర్సీబీ సబ్స్ : దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెథెల్, రసిక్ సలాం దార్, కనిష్క్ చౌహన్, వెంకటేశ్ అయ్యర్.