SRH vs RCB : భారీ విజయంతో క్వాలిఫయర్ 1 ఆడాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చల్లింది. ఉప్పల్‌లో 256 పరుగులు ఛేదనలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(44) అదిరే ఆరంభమివ్వగా.. కృనాల్ పాండ్యా(41 నాటౌట్) జతగా పటిదార్(56) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సన్‌రైజర్స్ బౌలర్లు గొప్పగా రాణించినా ఆర్సీబీని 165లోపు కట్టడి చేయలేకపోయారు. దాంతో.. హైదరాబాద్ మూడో స్థానానికే పరిమితమైంది.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌కు బౌలర్లు భారీ స్కోర్ సమర్పించుకోగా.. ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(44) అదిరే ఆరంభమిచ్చాడు. శివాంగ్ ఓవర్లో మూడు సిక్సర్లు, ఫోర్‌తో ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ప్రమాదకరంగా మారిన అయ్యర్‌ను మలింగ బోల్తా కొట్టించాడు. సిక్సర్‌కు యత్నించిన అయ్యర్ మిడాన్‌లో అభిషేక్ చేతికి చిక్కాడు. కాసేపటికే షకీబ్ ఓవర్లో కవర్స్‌లో ఆడిన విరాట్ కోహ్లీ(15) స్మరణ్ చేతికి చిక్కాడు. దాంతో. పవర్ ప్లేలో ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కీలక వికెట్లు పడడంతో పడిక్కల్, పటిదార్ ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నారు.
Ending the league stage on a 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 note 🤩🔥 pic.twitter.com/iw6Dh02udy
— SunRisers Hyderabad (@SunRisers) May 22, 2026
కానీ, పడిక్కల్‌ను ఔట్ చేసి రెండో వికెట్ సాధించాడు మలింగ. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(41 నాటౌట్) జతగా పటిదార్(56) .. సన్‌రైజర్స్ క్వాలిఫయర్ 1 అవకాశాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడాడు. పెద్ద షాట్లకు వెళ్లకుండావికెట్ కాపాడుకుంటూ స్ట్రయిక్ రొటేట్ చేశారు. పార్ట్ టైమ్ బౌలర్ హెడ్ ఓవర్లో పాటిదార్ పెద్ద షాట్ ఆడి బౌండరీ వద్ద చిక్కాడు. 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ జయభేరి మోగించింది.
క్వాలిఫయర్ 1 పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టింది. ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ(56) మెరుపు ఆరంభాన్వివ్వగా.. ఇషాన్ కిషన్(79), క్లాసెన్(51) జోడీ తర్ధ శతకాలతో ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టింది. వీరిద్దరూ శతక భాగస్వామ్యం నెలకొల్పగా.. డెత్ ఓవర్లలో నితీశ్ రెడ్డి(29 నాటౌట్) సిక్సర్లతో రెచ్చిపోగా హైదరాబాద్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
