SRH vs RCB | ఆర్సీబీతో అమీతుమీ.. ఇలా గెలిస్తేనే క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్.. !
SRH vs RCB : చివరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయం. ఆరంభ పోరులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది.
SRH vs RCB : పంతొమ్మిదో సీజన్లో బ్యాటర్ల విధ్వంసానికి, బౌలర్ల సంచలన ప్రదర్శన తోడవ్వగా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) క్వాలిఫయర్ 1 ఆడేందుకు పోటీ పడుతోంది. సొంతగడ్డపై జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయం. దాంతో.. ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీని చిత్తు చేసి.. ఆరంభ పోరులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది.
ప్రస్తుతం ఆర్సీబీ 9 విజయాలు 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 89 పరుగుల తేడాతో చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 18 పాయింట్లతో రెండో ర్యాంకులో పాగా వేసింది. 16 పాయింట్లతో మూడులో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడుతోంది. ఉప్పల్ స్టేడియంలో ఈ సీజన్లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలుపొందిన ఆరెంజ్ ఆర్మీ అదే ఉత్సాహంతో ఆర్సీబీకి చెక్ పెట్టాలని భావిస్తోంది.
SRH can still pip table-toppers RCB for a top-two finish 👀 pic.twitter.com/YZPCaHvKgo
— ESPNcricinfo (@ESPNcricinfo) May 22, 2026
88 పరుగుల తేడాతో
సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-2లోకి దూసుకెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తే సరిపోదు.. పరుగుల అంతరం భారీగా ఉండాలి. అంటే.. తొలుత బ్యాటింగ్ చేసి 220 కొడితే ఆర్సీబీని 88 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ రెండొందలు కొడితే 87 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేయాలి. అదే ఛేజింగ్ విషయానికొస్తే.. 150 పరుగుల లక్ష్యాన్ని 11.1 ఓవర్లలో లేదా 11.3 ఓవరల్లో అందుకోవాలి. అప్పుడే రన్‌రేటు(+0.695)లో గుజరాత్‌ను, ఆర్సీబీని వెనక్కి నెట్టేసి సన్‌రైజర్స్ ముందుకెళ్తుంది.
Make way for 𝐓𝐡𝐞 𝐑𝐢𝐬𝐞𝐫𝐬 🔥 pic.twitter.com/HCvmo4ghZh
— SunRisers Hyderabad (@SunRisers) May 22, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

