బ్యాన్ ఉన్నా.. దుబాయిలో స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

న్యూఢిల్లీ: మేరీకోమ్‌తో సహా 30 మంది ఇతర భారతీయ బాక్సింగ్ క్రీడాకారులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం శనివారం తెల్లవారుజామున అత్యవసరంగా దుబాయి విమానాశ్రయంలో ల్యాండైంది. ఫ్యూయల్ ఎమర్జెన్సీ వల్లే ల్యాండయినట్లు స్పైస్ జెట్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తిగా కేంద్ర పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 45 నిమిషాల పాటు దుబాయి విమానాశ్రయంలోనే విమానం నిలిచిపోయింది.
కరోనా ఆంక్షల మధ్య ఈ నెల 24వ తేదీ నుంచి దోహాలో జరిగే ఆసియన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ టోర్నీకి భారతీయ బాక్సర్లను ప్రత్యేక అనుమతితో స్పైస్ జెట్ విమానం వెళ్లేందుకు బయలుదేరింది. వచ్చేనెల ఒకటో తేదీ వరకు చాంపియన్ షిప్ టోర్నీ జరుగుతుంది. ఈ విమానంలో 31 మంది బాక్సర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శనివారం తెల్లవారుజామున 2.20 గంటలకు ఈ విమానం బయలుదేరింది. ఉదయం 6.20 గంటలకు దుబాయి విమానాశ్రయంలో ల్యాండయింది.
ఫ్యూయల్ ఎమర్జెన్సీ అని పేర్కొనడంతో విమానాశ్రయంలో దిగేందుకు అనుమతించిన యూఏఈ అధికారుల్లో కొంత గందరగోళం నెలకొనడంతో 45 నిమిషాల పాటు విమానం నిలిచిపోయింది. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో గత నెల 25 నుంచి భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులను యూఏఈ నిషేధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

