నాదల్, స్వియాటెక్ ముందంజ
- యూఎస్ ఓపెన్
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్, రెండో సీడ్ రాఫెల్ నాదల్, మహిళల టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ ముందంజ వేశారు. శుక్రవారం రెండో రౌండ్లో నాదల్ 2-6, 6-4, 6-2, 6-1తో ఫాబియో ఫాగ్నినిపై, స్వియాటెక్ 6-3, 6-2తో స్లోన్ స్టీఫెన్స్‌పై విజయం సాధించారు. ఇతర సీడెడ్ క్రీడాకారులు అండ్రీ రుబ్లెవ్, డెనిస్ షపొవలొవ్, కామెరూన్ నోరి, జానిక్ సిన్నర్, అల్కారజ్ గార్ఫియా, అరినా సబలెంక, గార్బిన్ ముగురుజ మూడో రౌండ్‌కు చేరుకున్నారు.
పురుషుల విభాగంలో టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన నాదల్ తొలి సెట్ చేజార్చుకున్నా.. నిగ్రహం కోల్పోకుండా ఆపై వరుసగా మూడు సెట్లు గెలుచుకుని సునాయాసంగా ముందంజ వేశాడు. 2 గంటల 43 నిమిషాల పాటు సాగిన పోరులో నాదల్ ఆరంభంలో తడబడ్డాడు. రెండుసార్లు మాత్రమే సర్వీసు నిలుపుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి ఫామ్ అందుకుని ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాడు.
నాదల్ నాలుగు ఏస్‌లు సర్వ్ చేయగా, ఫాగ్నిని ఒక ఏస్ మాత్రమే చేయగలిగాడు. ఇక డబుల్ ఫాల్ట్‌లలో నాదల్ రెండుసార్లు తప్పిదం చేయగా, ఫాగ్నిని ఏకంగా తొమ్మిది తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్ తొమ్మిది, ఫాగ్నిని ఆరు బ్రేక్ పాయింట్లు సాధించారు. ఇక అనవసర తప్పిదాలకు వస్తే నాదల్ 37, ఫాగ్నిని 60 చేశారు. మొత్తంగా నాదల్ ప్రత్యర్థికంటె మెరుగైన ఆటతో తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు.
ఇతర మ్యాచ్‌లలో ఫ్రాన్సెస్ టియాఫొ 7-6 (3), 7-5, 7-6 (2)తో జాసన్ కుబ్లర్పై, ఇల్యా ఇవాష్క 6-4, 4-6, 7-6 (5), 6-3తో హ్యూబర్ట్ హర్కజ్పై, డెనిస్ షపొవలొవ్ 6-4, 4-6, 6-3, 6-2తో కార్బెల్లెస్ బెనపై, రిచర్డ్ గాస్కెట్ 6-2, 6-4, 4-6, 6-4తో మియోమిర్ కెమనోవిక్పై, ఆండ్రీ రుబ్లెవ్ 6-3, 6-0, 6-4తో క్వోన్ సూన్ వూపై విజయాలు నమోదు చేశారు.
స్వియాటెక్ దూకుడు

మహిళల టాప్ సీడ్ స్వియాటెక్ ప్రతిభముందు స్టీఫెన్స్ తలొగ్గింది. ఏస్‌లు, డబుల్‌ఫాల్ట్స్, అనవసర తప్పిదాలలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా బ్రేక్ పాయింట్లు, విన్నర్స్ సర్వ్‌లో స్వియాటెక్ సత్తాచాటింది. అవే ఆమెను విజేతగా నిలిపాయి. గంట 14 నిమిషాలపాటు సాగిన పోరులో స్వియాటెక్దే పైచేయిగా సాగింది. స్టీఫెన్స్ బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటూ స్వియాటెక్ పాయింట్లు సాధిస్తూ తన సీడింగ్‌కు న్యాయం చేకూర్చింది. ఇతర మ్యాచ్‌లలో అరినా సబలెంక 2-6, 7-6 (8), 6-4తో కయా కనేపిపై, గార్బిన్ ముగురుజ 6-0, 6-4తో లిండా ఫ్రువిర్టొవపై, క్లారా బరెల్ 6-4, 4-6, 6-4తో అలిన్ వాన్ ఉత్వాంక్పై, డేనియల్ కొలిన్స్ 6-2, 7-5తో క్రిస్టినా బక్సాపై, కరోలినా ప్లిస్కోవా 6-3, 6-2తో మేరీ బొజ్కొవాపై, క్విన్వెన్ జెంగ్ 7-6(4), 7-6(3)తో పొటపోవాపై, అలిజ్ కార్నెట్ 6-1, 1-6, 6-3తో సినియకోవాపై, యు యువాన్ 6-3, 7-6(6)తో కామెలియా బెగుపై గెలుపొందారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

