సర్రె: దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్ హాషిమ్ ఆమ్లా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న 39 ఏండ్ల ఆమ్లా.. 2019లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోగా.. ఇకపై లీగ్‌లకు కూడా దూరమవుతున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సర్రే జట్టు గురువారం వివరాలు వెల్లడించింది. ‘దక్షిణాఫ్రికా దిగ్గజం హాషిమ్ ఆమ్లా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు’ అని సర్రే టీమ్ ట్విట్టర్లో పేర్కొంది. దక్షిణాఫ్రికా తరఫున 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20లు ఆడిన ఆమ్లా.. మూడు ఫార్మాట్లలో కలిపి 18,672 పరుగులు చేశాడు.