Farhaan Behardien | అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్
2018 నవంబర్‌లో దక్షిణాఫ్రికా తరఫున చివరి మ్యాచ్ ఆడిన ఫర్హాన్
Farhaan Behardien : ఈ ఏడాది మరో ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా జట్టు వన్డే స్పెషలిస్ట్ ఫర్హాన్ బెహర్డియెన్ మంగళవారం క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ’18 ఏళ్ల జర్నీ.. అన్ని ఫార్మాట్లలో 560 మ్యాచ్‌లు. వీటిలో జాతీయ జట్టు తరఫున 97 మ్యాచ్‌లు’ అని ట్విట్టర్ వేదికగా ఫర్హాన్ తెలిపాడు. 2018 నవంబర్‌లో దక్షిణాఫ్రికా తరఫున ఇతను చివరి మ్యాచ్ ఆడాడు.
జొహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన ఇతను 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేశాడు. 125 మ్యాచుల్లో 7వేలకు పైగా పరుగులు సాధించాడు. అయితే.. జాతీయ జట్టులో చోటు కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2012 ఫర్హాన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు సంపాదించాడు. మూడు టీ20 వరల్డ్ కప్‌లు (2012, 2014, 2016), 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాడు. 59 వన్డేలు, 38 టీ20లు ఆడిన ఫర్హాన్ వన్డేల్లో 1,074 రన్స్, పొట్టి క్రికెట్లో 518 రన్స్ స్కోర్ చేశాడు. 2017లో దక్షిణాఫ్రికా టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా పనిచేశాడు. అయితే.. ఈ ఆల్‌రౌండర్ తన కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.
— Farhaan Behardien (@fudgie11) December 27, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

