Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Faf Du Plesis : డర్బన్‌లో తాము గొప్పగా ఆడలేకపోయామని కెప్టెన్ తెంబా బవుమా అంగీకరించగా.. టెస్టుల్లో ఆసీస్ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని ఫాఫ్ డూప్లెసిస్ (Faf Du Plesis) అన్నాడు.
Faf Du Plesis : స్వదేశంలో రెండేళ్ల తర్వాత తొలి టెస్టు ఓడిపోయింది దక్షిణాఫ్రికా (South Africa). మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలనుకున్న సఫారీ బృందానికి ఆస్ట్రేలియా ఊహించని షాకిచ్చింది. డర్బన్ టెస్టు (Durban Test)లో 214 పరుగుల ఓటమికి మ్యాట్ రెన్షా సంచలన బ్యాటింగ్, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ ప్రధాన కారణాలు. డర్బన్‌లో తాము గొప్పగా ఆడలేకపోయామని కెప్టెన్ తెంబా బవుమా అంగీకరించగా.. టెస్టుల్లో ఆసీస్ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని ఫాఫ్ డూప్లెసిస్ (Faf Du Plesis) అన్నాడు.
టెస్టు క్రికెట్లో మళ్లీ ఆస్ట్రేలియా జోరు మొదలైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన ఆసీస్.. డర్బన్ టెస్టులో భారీ విజయంతో హెచ్చరికలు పంపింది. బలమైన బ్యాటింగ్ లైనప్, పటిష్టమైన పేస్ దళం ఆ జట్టు విజయంలో కీలకమయ్యాయి. డర్బన్‌లో దక్షిణాఫ్రికా ఓటమిని విశ్లేషించిన మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్.. కంగారూ టీమ్‌లోని మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ చాలా ప్రమాదకరమని అతడు అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో వీరిని ఎదుర్కోవడం చాలా కష్టమని అతడు క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో అన్నాడు.
Starc ✅ Cummins ✅ Hazlewood ✅
Faf du Plessis breaks down what makes Australia’s Test pace trio so difficult to face 👁️🗨️ https://t.co/eRgNSEg3Uk
— Cricinfo (@cricinfo) October 15, 2026
‘ఆస్ట్రేలియా బౌలర్లు బ్యాటర్లకు పరీక్ష పెడతారు. ముఖ్యంగా పేస్ త్రయంలోని స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ చాలా డేంజర్. ఎందుకంటే.. ఈ ముగ్గురు వైవిధ్యమైన పేసర్లు. ఎడమచేతి వాటం పేసరైన స్టార్క్ కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. అతడు తరచూ బ్యాటర్లను ఎల్బీగా ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్‌తో స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుంటాడు మిస్సైల్ స్టార్క్.
కమిన్స్ విషయానొకొస్తే కచ్చితత్వంలో కూడిన బౌలింగ్ అతడిది. స్టంప్స్‌ను టార్గెట్ చేస్తాడు. ఢిఫెన్స్లో బలహీనంగా ఉన్న బ్యాటర్లను వణికిస్తాడు. ముఖ్యంగా నుదిటిని తాకేలా పదునైన బౌన్సర్లు సంధిస్తాడు. పొడగరి అయిన హేజిల్‌వుడ్ అదనపు బౌన్స్ రాబట్టగలడు. అతడు కూడా కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. మొత్తంగా ఈ ముగ్గుర టెస్టుల్లో ఆస్ట్రేలియా పాలిట గెలుపు గుర్రాలు. సంప్రదాయ క్రికెట్ షాట్లతోనే వీరిని కాస్త నిలువరించవచ్చు’ అని డూప్లెసిస్ పేర్కొన్నాడు.
రెండు నుంచి మూడుకు
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా డర్బన్ టెస్టులో ఘన విజయం సాధించింది. గత సీజన్ విజేత దక్షిణాఫ్రికాను అనూహ్యంగా కంగుతినిపించిన ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగిన హేజిల్‌వుడ్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఫలితంగా 214 పరుగుల తేడాతో ఓడిన సఫారీ టీమ్ డబ్ల్యూటీసీలో రెండో స్థానం నుంచి మూడుకు పడిపోయింది. న్యూజిలాండ్ రెండుకు ఎగబాకింది. ఈ సిరీస్‌లో కీలకమైన రెండో టెస్టు అక్టోబర్ 18, ఆదివారం నుంచి గెబెర్స్లోని సెయింట్ జార్జ్ పార్కులో జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

