Sourav Ganguly Biopic: వెండితెరపై దాదా బయోపిక్..! హీరోగా నేషనల్ అవార్డు విన్నర్
Sourav Ganguly Biopic: భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కబోతున్నది. అభిమానులంతా ‘దాదా’, ‘కోల్‌కతా ప్రిన్స్’ అని పిలుచుకునే గంగూలీ బయోపిక్‌లో....
Sourav Ganguly Biopic: గత కొన్నాళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘బయోపిక్’ చిత్రాల బాటలో మరో సినిమా రాబోతున్నది. భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కబోతున్నది. అభిమానులంతా ‘దాదా’, ‘కోల్‌కతా ప్రిన్స్’ అని పిలుచుకునే గంగూలీ బయోపిక్‌లో దాదా పాత్రను నేషనల్ అవార్డు (విక్కీ డోనర్ చిత్రానికి) విన్నర్, తనదైన వైవిద్యమైన చిత్రాలతో అలరిస్తున్న అయుష్మాన్ ఖురానా పోషించబోతున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా.. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు బాలీవుడ్ వర్గాల వినికిడి.
లవ్ రంజన్, అంకుర్ గార్గ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. ప్రస్తుతం ఖురానా, మోత్వానీలు గంగూలీ బయోపిక్ కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దాదా మాదిరిగానే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడే ఖురానా.. ఇదివరకే గంగూలీ హావబావాలు, అతడు ఆడే విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది పూర్తయ్యాక సినిమా సెట్స్‌పై వెళ్లే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేశారు.
క్రీడాకారుల బయోపిక్‌లకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. మహేంద్ర సింగ్ ధోని మొదలు సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, కపిల్ దేవ్, మిథాలీ రాజ్ వంటి క్రికెటర్లతో పాటు బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్ కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. భారత క్రికెటర్‌గా, కెప్టెన్‌గానే గాక బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన గంగూలీ జీవితంలో కాంట్రవర్సీలకు కొదవలేదు. మరి ఈ బయోపిక్‌లో మోత్వానీ దాదా జీవితాన్ని ఎలా తెరకెక్కిస్తాడోనని అతడి అభిమానులు వేచి చూస్తున్నారు. మోత్వాని గతంలో ఉడాన్ లూటేరా, ఎన్‌హెచ్10, బాంబే వెల్వెట్, ఉడ్తా పంజాబ్ వంటి హిట్చిత్రాలు తీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

