రొనాల్డో రాక్స్
అంచనాలకు అనుగుణంగా రాణించిన పోర్చుగల్.. ఫిఫా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. గ్రూప్-‘హెచ్'లో భాగంగా గురువారం జరిగిన పోరులో పోర్చుగల్ 3-2 తేడాతో ఘనాపై నెగ్గింది
- పోర్చుగల్ బోణీ
- 3-2తో ఘనాపై గ్రాండ్ విక్టరీ
- ఫిఫా ప్రపంచకప్
విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్టో.. అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ బోణీ కొట్టింది. ర్యాంకింగ్స్‌లో తమ కంటే చాలా వెనుకబడి ఉన్న ఘనాపై పోర్చుగల్ చెమటోడ్చి నెగ్గింది. చిన్న టీమ్ అయినా ఘన తమ పోరాటంతో అభిమానుల మనసులు దోచుకుంది.
ఖతార్: అంచనాలకు అనుగుణంగా రాణించిన పోర్చుగల్.. ఫిఫా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. గ్రూప్-‘హెచ్’లో భాగంగా గురువారం జరిగిన పోరులో పోర్చుగల్ 3-2 తేడాతో ఘనాపై నెగ్గింది. పోర్చుగల్ తరఫున క్రిస్టియానో రొనాల్డో (65వ నిమిషంలో) పెనాల్టీని గోల్‌గా మలచగా.. ఫెలిక్స్ (78వ ని.లో), రాఫెల్ లావో (80వ ని.లో) చెరో ఫీల్డ్ గోల్ నమోదు చేశారు. ఘనా తరఫున ఆండ్రే (73వ ని.లో), ఉస్మాన్ బుకారీ (89వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 9వ ర్యాంక్‌లో ఉన్న పోర్చుగల్.. 61వ ర్యాంకర్ ఘనాపై గెలిచేందుకు ఆపసోపాలు పడింది.
తొలి అర్ధభాగం మొత్తం పోర్చుగల్ ఆధిపత్యం కనబర్చినా.. గోల్ కొట్టడంలో మాత్రం విఫలమైంది. రెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. స్టార్ ఆటగాడు రొనాల్డోను ప్రత్యర్థి ప్లేయర్ దురుసుగా అడ్డుకోవడంతో పోర్చుగల్‌కు పెనాల్టీ అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగ పరుచుకున్న రొనాల్డో ఘనా గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం రొనాల్డో నామస్మరణతో మారుమోగిపోగా.. కాసేపటికి ఘనా స్కోరు సమం చేసింది.
అయితే రెండు నిమిషాల వ్యవధిలో రెండు ఫీల్డ్ గోల్స్‌తో రెచ్చిపోయిన పోర్చుగల్.. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని సాకర్ విశ్వ సమరంలో బోణీ కొట్టింది. పూర్తి సమయంలో 62 శాతం బంతిని తమ ఆధినంలో ఉంచుకున్న పోర్చుగల్.. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై 5 సార్లు దాడి చేసి అందులో మూడు గోల్స్ నమోదు చేసుకుంది. ఆఖరి నిమిషంలో పోర్చుగల్ గోల్ కీపర్ తప్పిదం వల్ల ఘనాకు స్కోర్లు సమం చేసే అవకాశం వచ్చినా.. ఇతర ఆటగాళ్లు దాన్ని అడ్డుకోవడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది.
సూపర్ సౌత్‌కొరియా
ఫిఫా ప్రపంచకప్‌లో మరో ఆసియా జట్టు అదరగొట్టింది. ఇప్పటికే సౌదీఅరేబియా, జపాన్ వరుసగా అర్జెంటీనా, జర్మనీపై సంచలన విజయాలు సాధించగా, తాజాగా దక్షిణకొరియా.. పటిష్ట ఉరుగ్వేను ఓడించినంత పనిచేసింది. గురువారం కొరియా, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూపు-హెచ్ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ర్యాంకింగ్స్ పరంగా తమ (28) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఉరుగ్వే (14)కు దీటైన పోటీనిచ్చింది. అనుభజ్ఞలైన ఉరుగ్వే ప్లేయర్లతో పోల్చుకుంటే కొరియా ప్లేయర్లు దూకుడు ప్రదర్శించారు.
తొలి నిమిషం నుంచే మైదానంలో పాదరసంలా కదులుతూ బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నం చేశారు. ఓవైపు ఉరుగ్వే దాడులను సమర్థంగా తిప్పికొడుతూ మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా గోల్ చేసేందుకు ప్రయత్నించారు. మ్యాచ్ 34వ నిమిషంలో కొరియా ప్లేయర్ హ్వంగ్ ఉయి జో కొట్టిన బంతి గోల్‌పోస్ట్‌ను తాకుతూ వెళ్లడంతో ఉరుగ్వే ఊపిరి పీల్చుకుంది.
మాస్క్ ధరించి పోటీకి దిగిన స్టార్ ప్లేయర్ సన్ హ్యుంగ్మిన్కు ప్రేక్షకుల నుంచి అశేష మద్దతు లభించింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో బెల్జియం 1-0తో కెనడాపై గెలువగా, స్విట్జర్లాండ్ 1-0తో కామెరూన్‌ను ఓడించింది. మిచీ బత్సుయి (44ని) బెల్జియంకు ఏకైక గోల్ అందించగా, బ్రీల్ ఎంబెలో (48ని) స్విస్‌ను ఆదుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

