హైదరాబాద్: రాష్ట్ర యువ గోల్ఫర్ స్నేహా సింగ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వెస్ట్రన్ ఇండియా లేడిస్, జూనియర్ బాలికల చాంపియన్‌షిప్‌లో స్నేహ టైటిల్‌తో మెరిసింది. బౌల్డర్ హిల్స్‌లో ప్రస్తుతం బ్రెండన్ డిసౌజా దగ్గర ప్రాక్టీస్ పొందుతున్న స్నేహ మెరుగైన ప్రదర్శనతో టైటిల్ ఒడిసిపట్టుకుంది. గత వారం బెంగళూరులో జరిగిన రోటరీ అమెచ్యూర్ గోల్ఫ్ చాంపియ్షిప్లోనూ ఈ యువ గోల్ఫర్ టైటిల్ విజేతగా నిలిచింది.