SL vs AUS | దెబ్బతీసిన జంపా.. నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
SL vs AUS | ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను స్పిన్నర్ ఆడమ్ జంపా దెబ్బతీశాడు. తొలి 6 ఓవర్లలో 53 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన లంక

దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను స్పిన్నర్ ఆడమ్ జంపా దెబ్బతీశాడు. తొలి 6 ఓవర్లలో 53 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన లంక.. జంపా ఉచ్చులో పడింది. తన రెండో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న అసలంకను అవుట్ చేసిన జంపా.. ఆ తర్వాత అవిష్క ఫెర్నాండో వికెట్ కూడా పడగొట్టాడు.
ఓపెనర్ కుశాల్ పెరీరాను మిచెల్ స్టార్క్ బౌల్డ్ చేయడంతో లంక కష్టాల్లో పడింది. జంపా తీసిన రెండు వికెట్లూ క్యాచ్ అవుట్లు కాగా, రెండు క్యాచ్‌లూ స్టీవ్ స్మిత్ అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వానిందు హసరంగ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మాథ్యూవేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో లంక 94/5తో ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో భానుక రాజపక్స, డాసున్ షనక ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

