Shreyas Iyer | 2022కు ఘనంగా వీడ్కోలు పలికిన శ్రేయాస్ అయ్యర్.. వైరల్ వీడియో చూడాల్సిందే
ఈ ఏడాది టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన శ్రేయాస్
Shreyas Iyer : టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 2022కు జ్జాపకాల వీడియోతో ఘనంగా వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది తన జీవితంలోని సంతోషకరమైన జ్జాపకాల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. 2022 – ఎన్నో జ్జాపకాలు. సరదాగా, సంతోషంగా గడించింది అంటూ ఆ వీడియోకు అతను క్యాప్షన్ రాశాడు. వీడియోలో శ్రేయాస్ హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తూ, భారత జట్టు సభ్యులతో, కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకొన్న అతను పునరాగమనం తర్వాత అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అతను గుర్తింపు సాధించాడు.
ఈ ఏడాది ఐదు టెస్టులు, 17 వన్డేలు, 17 టీ20లు ఆడిన అయ్యర్ 1,609 రన్స్ స్కోర్ చేశాడు. టెస్టుల్లో 422, వన్డేల్లో 724, టీ20ల్లో 463 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు విజయంలో అయ్యర్ పాత్ర మరువలేనిది. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి అతను తొమ్మిదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు. గతంలో అతను కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

