Shreyas Iyer: టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
Shreyas Iyer: ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రకటించారు. ముంబైలో ఇవాళ జరిగిన సెలెక్షన్ కమిటీ మీటింగ్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఆ బృందంలో చోటు కల్పించారు.
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రకటించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో ఆడే భారత ప్లేయర్ల జాబితాను ఇవాళ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రిలీజ్ చేసింది. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి ఆ బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్‌కు అప్పగించారు. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా ఇండియా రెండు టీ20లు ఆడనున్నది. జూన్ 26, 28వ తేదీల్లో ఆ మ్యాచ్‌లు డబ్లిన్‌లో జరగనున్నాయి. ఇక జూలై ఒకటో తేదీ నుంచి 11 తేదీ వరకు ఇంగ్లండ్‌తో అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ఒలింపిక్స్‌తో పాటు 2028లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లను ప్రకటించారు. రెండు దేశాలతో జరిగే టీ20 సిరీస్ కోసం తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు.
ఇటీవల ముగిసిన 2026 ఐపీఎల్లో తన బ్యాటింగ్‌తో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీకి భారత బృందంలో చోటు దక్కింది. టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో సీనియర్ జట్టుకు ఎంపికైన యువ బ్యాటర్‌గా వైభవ్ రికార్డు క్రియేట్ చేశాడు. టోర్నీలో అత్యధికంగా 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. వైభవ్ తన బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు చేస్తున్న నేపథ్యంలో అతన్ని టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్‌లు కూడా భారత బృందంలో ఉన్నారు. ఇక సీనియర్ ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షదీప్ సింగ్ కూడా భారత బృందంలో ఉన్నారు.
టీ20లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయలేదు. ఐపీఎల్లో గేమ్ ప్లాన్‌తో దుమ్మురేపిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్‌ను కూడా సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది. ఇక స్టార్ బౌలర్ బుమ్రాకు రెస్టు ఇచ్చింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లకు బుమ్రాను ఎంపిక చేయలేదు. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్ కోసం అతన్ని ఎంపిక చేసింది. ఇక గాయపడ్డ కోహ్లీ స్థానంలో వన్డేల కోసం జైస్వాల్‌ను తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కోహ్లీ స్థానంలో జైస్వాల్ ఆడనున్నాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్ వరకు కోహ్లీ కోలుకునే అవకాశాలు ఉన్నట్లు అగార్కర్ చెప్పారు. టీ20 వరల్డ్‌కప్‌ను అందించిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, కనీసం అతన్ని జట్టులోకి కూడా తీసుకోకపోవడం గమనార్హం.
ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు భారత జట్టు ఇదే..
శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ(వీసీ), నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

