Shoaib Akhtar | ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకోలేదు.. కానీ: వెల్లడించిన షోయబ్ అక్తర్
Shoaib Akhtar | ప్రపంచ క్రికెట్లో అందరినీ భయపెట్టిన పేసర్ల జాబితాలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరు కచ్చితంగా ఉంటుంది. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరు తెచ్చుకున్న ఈ పేసర్..

ప్రపంచ క్రికెట్లో అందరినీ భయపెట్టిన పేసర్ల జాబితాలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరు కచ్చితంగా ఉంటుంది. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరు తెచ్చుకున్న ఈ పేసర్.. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడాడు. ఈ సందర్భంగా మరో స్టార్ పేసర్ బ్రెట్‌లీతో కలిసి తన జ్ఞాపకాలను పంచుకున్నాడు.
తనలో ఆటంబాంబులా ఎనర్జీ ఉండేదని, దాన్ని ఎక్కడో ఒక చోట ఖర్చు చేసేందుకే అంత వేగంగా బంతులు వేసేవాడినని అక్తర్ చెప్పాడు. తానెప్పుడూ పేసర్ అవ్వాలని అనుకోలేదని, కానీ తన ఎనర్జీ కుదురుగా కూర్చొనివ్వలేదని గుర్తుచేసుకున్నాడు.
‘చిన్ననాటి స్నేహితులతో మాట్లాడే సమయంలో నేను ప్రత్యేకమని చెప్పేవాడిని. వాళ్లు మాత్రం నీ వల్ల కాదురా అనేవారు. ఆ మాటలే నాలో మరింత పట్టుదలను పెంచాయి. అప్పుడే చెప్పా నాకు అడ్డొచ్చే గోడలను దాటుకుంటూ పోతానని’ అంటూ చెప్పాడు.
1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్.. గాయాల కారణంగా కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. చివరకు 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు మాత్రమే ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

