అంపైర్ ఔట్ ఇవ్వలేదని వికెట్లను తన్నిన స్టార్ ఆల్‌రౌండర్: వీడియో వైరల్

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో స్టార్ ఆల్‌రౌండర్, ఆజట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అతిగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయిన షకీబ్ ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ఫీల్డ్ అంపైర్‌తో గొడవకు దిగాడు. వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న షకీబ్ క్షమాపణలు చెబుతూ సోషల్మీడిఆయలో ఓ సందేశాన్ని విడుదల చేశాడు.
అసలేం జరిగిందంటే..!
మహ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్‌కు షకీబ్ కెప్టెన్. లీగ్‌లో భాగంగా మహ్మదాన్, అబహాని లిమిటెడ్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. అబహాని బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌కు షకీబ్ బంతి వేశాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్‌కు అప్పీల్ చేయగా నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంపై క్షణాల్లో ఆవేశానికి గురైన షకీబ్ వికెట్లను కాళ్లతో తన్నాడు.
మరికాసేపటికే ఆరో ఓవర్లో మళ్లీ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు షకీబ్. ఆరో ఓవర్లో ఒక బంతి మిగిలుండగా వర్షం రావడంతో అంపైర్ మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాడు. అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన షకీబ్..ఈసారి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను తీసి విసిరేశాడు. ప్రస్తుతం రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
Shakib Al Hasan not very impressed with the umpire in this Dhaka Premier Division Cricket League match #Cricket pic.twitter.com/iEUNs42Nv9
— Saj Sadiq (@SajSadiqCricket) June 11, 2021
One more… Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these… Chih… pic.twitter.com/iUDxbDHcXZ
— Saif Hasnat (@saifhasnat) June 11, 2021
Shakib Al Hasan has apologized to all the cricket fans for kicking the stumps after a call from the umpire and uprooting the stumps when the umpire decided to stop the stopped play when rain came. pic.twitter.com/0EyAXSkGQ8
— Johns. (@CricCrazyJohns) June 11, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

