Shaheen Afridi : పాకిస్థాన్ క్రికెట్లో మరో పెళ్లి బాజా మోగింది. ఆ జట్టు స్పీడ్‌స్టర్ షాషీన్ ఆఫ్రీదీ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రీదీ రెండో కూతురు అన్షా అఫ్రీదీని అతను పెళ్లి చేసుకున్నాడు. మత పెద్దల సమక్షంలో ఈరోజు కరాచీలో నిఖా వైభవంగా జరిగింది. వీళ్ల వివాహ వేడుకకు పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజాం, సర్ఫరాజ్ అహ్మద్, నసీం షా, షాదాబ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. షాహీన్, అన్షా పెళ్లి వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. షాహీన్ ఆఫ్రీదీ, అన్షా పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని షాహిద్ ఆఫ్రీదీ 2021లో వెల్లడించిన విషయం తెలిసిందే. పోయిన ఏడాది డిసెంబర్ 30వ తేదీన నసీం నాసిర్, షాహీద్ ఆఫ్రీదీ పెద్ద కూతురు అక్సా వివాహం జరిగింది.
పాక్ జట్టులో కీలక బౌలర్ అయిన షాహీన్ ఆఫ్రీదీ ఈమధ్యే మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్యాలండర్స్ జట్టుకు ఈ స్పీడ్‌స్టర్ కెప్టెన్. త్వరలో జరగనున్న పీఎస్ఎల్ సీజన్లో మళ్లీ తన జట్టును విజేతగా నిలపాలని అనుకుంటున్నాడు.