ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి
ప్రతికా రావల్ (100 నాటౌట్) అజేయ శతకానికి తోడు తెలుగమ్మాయి శ్రీచరణి (4/23) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో సత్తా చాటడంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
- తొలి వన్డేలో భారత్ ఘన విజయం
వడోదర: ప్రతికా రావల్ (100 నాటౌట్) అజేయ శతకానికి తోడు తెలుగమ్మాయి శ్రీచరణి (4/23) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో సత్తా చాటడంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. షఫాలీ వర్మ (33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్) కూడా దంచికొట్టడంతో జింబాబ్వే ఇచ్చిన 198 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 27.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన (32)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ప్రతికా ఓపెనర్‌గా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా గ్రౌండ్ షాట్లతో హోరెత్తించింది.
తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించిన తర్వాత మంధాన ఔటవగా.. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన షఫాలీ టీ20 స్టయిల్లో విజృంభించింది. భారీ షాట్ల తో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో టార్గెట్ ఇట్టే కరిగిపోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఆతిథ్య బౌలర్ల దెబ్బకు 49.5 ఓవర్లలో 197 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై భారత బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన చేశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణితో వరుస వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచింది. క్రాంతి గౌడ్ (3/42), దీప్తి శర్మ (2/44) కూడా రాణించారు. జింబాబ్వే బ్యాటర్లలో బెలోవెడ్ బిజా (62) అర్ధశతకంతో పోరాడింది. ప్రతికాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో వన్డే ఆదివారం జరగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి
బౌలర్లపైనే బెంగ.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

