DC vs UPW : ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ(21) ఔటయ్యింది. సొప్పదండి యషశ్రీ ఓవర్లో లాంగాఫ్‌లో షఫాలీ భారీ షాట్ ఆడింది. ఎకిల్‌స్టోన్ డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. దాంతో, 56 రన్స్ వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది. మేగ్ లానింగ్ (30), జెమీమా రోడ్రిగ్స్(0) క్రీజులో ఉన్నారు. లానింగ్, షఫాలీ ధాటికి ఢిల్లీ ఐదు ఓవర్లకు 56 రన్స్ చేసింది. షబ్నం ఇస్మాయిల్ వేసిన తొలి ఓవర్లో లానింగ్ రెచ్చిపోయింది. మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో ఏకంగా 20 రన్స్ వచ్చాయి.