PSL 2024 | స్టేడియంలో ‘బాబర్.. బాబర్’ అంటూ అభిమానుల అరుపులు.. అలా అరిచి అవమానించద్దన్న పాక్ స్పిన్నర్
PSL 2024 | పాకిస్తాన్ మాజీ సారథి బాబర్ ఆజమ్‌కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే అతడిమీద అభిమానం ఇతరుల మీద దురభిమానానికి దారితీస్తోంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది.
PSL 2024 | పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో పెషావర్ జల్మీ తరఫున ఆడుతున్న ఆ దేశ జాతీయ జట్టు మాజీ సారథి బాబర్ ఆజమ్‌కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే అతడిమీద అభిమానం ఇతరుల మీద దురభిమానానికి దారితీస్తోంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. పీఎస్ఎల్ – 2024లో భాగంగా పెషావర్ జల్మీ – ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ అభిమానులు కొందరు.. ఇస్లామాబాద్ ప్లేయర్ ఇమాద్ వసీంను లక్ష్యంగా చేసుకుని ‘బాబర్.. బాబర్’ అని అరిచారు. ఇలా అరవడం తప్పని, ఆటగాళ్లు ఒక్కోసారి వీటికి చాలా బాధపడుతారని ఇస్లామాబాద్ సారథి, పాక్ జట్టులో ఉన్న స్పిన్ ఆల్ రౌండర్ అయిన షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శనివారం (మార్చి 16) పెషావర్ – ఇస్లామాబాద్ మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ఇమాద్ వసీంను చూసిన బాబర్ ఫ్యాన్స్.. అతడిని చూస్తూ ‘బాబర్.. బాబర్’ అని బిగ్గరగా అరిచారు. అప్పుడు ఇమాద్ వారిని వారించకుండా ఇంకా అరవండని ఎంకరేజ్ చేశాడు. ఈ వివాదంపై మ్యాచ్ ముగిశాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షాదాబ్ ఖాన్ స్పందించాడు. ‘కచ్చితంగా ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధగా ఉంటుంది. పాకిస్తాన్ తరఫున చాలాకాలంగా ఆడుతూ మ్యాచ్ విజయాలలో భాగస్వామిగా ఉన్న ఓ క్రికెటర్‌పై ఇలా ప్రవర్తించకూడదు. అప్పుడు ఆ క్రికెటర్లు కూడా ఇన్నాళ్లుగా నా దేశం కోసం క్రికెట్ ఆడుతున్నా నన్ను వీళ్లంతా ఇలా ట్రీట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు..’ అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పెషావర్ జెల్మీ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించిన ఇస్లామాబాద్.. ఫైనల్లో ఈ నెల 18న ముల్తాన్ సుల్తాన్స్‌తో ఆడనుంది.
Imad Wasim Replied to Fans Babar Azam Chants 🤙🖤#ImadWasim #BabarAzam𓃵 #PSL9 #BabarAzam #PSL2024 pic.twitter.com/dCIs3oHzvV
— Arsalan Iqbal (@Arsalan88915193) March 10, 2024
కాగా బాబర్ – ఇమాద్ల మధ్య విభేదాలు ఇప్పటివి కావు. ఈ ఇద్దరూ కలిసి కరాచీ కింగ్స్‌కు ఆడారు. 2023లో బాబర్.. కరాచీని వీడినప్పుడు ఇమాద్ బాబర్‌ను ఉద్దేశించి అసలు అతడు తన సొంత రికార్డుల కోసం టీమ్ కోసం ఏమీ చేయలేదంటూ వ్యాఖ్యానించాడు. అంతేగాక గతేడాది వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కూడా పాక్ ఓటములకు పరోక్షంగా బాబర్‌ను కారణంగా చూపాడు. దీంతో అప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్నాయని పాక్ క్రికెట్లో జోరుగా చర్చ సాగుతోంది. తాజా ఘటన దానికి కొనసాగింపు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
عماد وسیم نے پاکستان کے لیے بہت کھیلا ہے فینز کی جانب سے ان کے خلاف ایسے نعرے ٹھیک نہیں تھے۔ مجھے لگتا ہے عماد وسیم کو اس بات کا برا لگا ۔ شاداب خان کا میرے سوال پر جواب pic.twitter.com/nQdLDvxPzt
— ٰImran Siddique (@imransiddique89) March 16, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

