న్యూయార్క్: యుఎస్ ఓపెన్‌లో ఆడేందుకు సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్‌కు నిరాకరించాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్ వాక్సినేషన్ తీసుకోనివారికి అమెరికాలో ప్రవేశం లేనందున ఈ యేడాది తాను యుఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు జొకోవిచ్ గురువారం ప్రకటించాడు. వచ్చే యేడాది యుఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని ఆశిస్తూ తోటి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపాడు. వాస్తవంగా జొకోవిచ్ పేరు ఆటగాళ్ల జాబితాలో ఉన్నప్పటికీ నిబంధల ప్రకారం అమెరికాలో ప్రవేశం లేనందున టోర్నీనుంచి విరమించుకుంటున్నట్టు జొకో తెలిపాడు.