Sanju Samson : పొట్టి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ (Sanju Samson) మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో వరసగా మూడు మ్యాచుల్లో విఫలమైన సంజూ.. చెపాక్‌లో చెలరేగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులను సంబురాల్లో ముంచెత్తుతూ ఈ ఎడిషన్‌లో తొలి అర్ధ శతకం కొట్టేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సంజూ ముకేశ్ ఓవర్లో సింగిల్‌తో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. పసుపు జెర్సీతో అతడికిదే మొదటి యాభై కావడంతో.. మనసు తేలికైనట్టుగా కనిపించాడు శాంసన్.
కలల జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దుమ్మురేపాలనుకున్న సంజూ శాంసన్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. ఐపీఎల్లో తొలిసారి సీఎస్కేకు ఆడుతూ.. మూడు మ్యాచుల్లో నిరాశపరిచిన సంజూ శనివారం తన తడాఖా చూపించాడు. వరల్డ్‌కప్ ఫామ్‌ను అందుకుంటూ బౌండరీలతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల భరతం పట్టాడు.
Maiden 5⃣0⃣ in yellow 💛@IamSanjuSamson thrills Chennai 🙌 #CSK 77/1 after 9 overs.
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC pic.twitter.com/s7GUTw9p5O
— IndianPremierLeague (@IPL) April 11, 2026
రంజీ సంచలనం అకీబ్ ధార్ ఓవర్లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన ఈ చిచ్చరపిడుగు.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఓవర్లలో వడివడిగా పరుగులు పిండుకున్నాడు. ముకేశ్ ఓవర్లో సింగిల్‌తో సీఎస్కే తరఫున మొట్టమొదటి అర్ధ శతకం సాధించాడు. 26 బంతుల్లో 9 ఫోర్లతో యాభై కొట్టిన సంజూ భారీ స్కోర్ దిశగా సాగుతున్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(15) సైతం