ICC | వరల్డ్‌కప్ హీరో శాంసన్‌కు ఐసీసీ అవార్డు.. బుమ్రాకు నిరాశ..!
ICC : పొట్టి వరల్డ్‌కప్‌లో పిడుగుల్లే విరుచుకపడిన సంజూ శాంసన్ (Sanju Samson)కు తగిన గుర్తింపు దక్కింది. భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకమైన సంజూకు ఐసీసీ అవార్డు లభించింది.
ICC : పొట్టి వరల్డ్‌కప్‌లో పిడుగుల్లే విరుచుకపడిన సంజూ శాంసన్ (Sanju Samson)కు తగిన గుర్తింపు దక్కింది. సంచలన ఇన్నింగ్స్‌లతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకమైన సంజూకు ఐసీసీ అవార్డు లభించింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో హ్యాట్రిక్ అర్ధ శతకాలతో భారత్‌ను విజేతగా నిలిపిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. మార్చి నెలకు ఐసీసీ జరిపిన ఓటింగ్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టేసి శాంసన్ ఈ గౌరవాన్ని అందుకున్నాడు. మహిళల విభాగంలో అమేలియా కేర్ అవార్డును ఎగరేసుకుపోయింది.
భారత్, శ్రీలంక వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో చిరస్మరణీయ ఆట ఆడిన సంజూ శాంసన్‌ను ఐసీసీ అవార్డు వరించింది. క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97.. ఆపై ఇంగ్లండ్ మీద 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై అర్ధ శతకంతో రెచ్చిపోయిన సంజూ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుపొందాడు. తనకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు.
3⃣2⃣1⃣ runs 👌
8⃣0⃣.2⃣5⃣ average 🫡
3⃣ fifties 🙌Congratulations to @IamSanjuSamson on being named the ICC Men’s Player of the Month for March 🏅 following his staggering show in #TeamIndia’s triumphant ICC Men’s T20 World Cup 2026 campaign 👏👏 pic.twitter.com/59LSRAj5Hk
— BCCI (@BCCI) April 14, 2026
‘ఐసీసీ అవార్డుకు ఎంపికవ్వవడం ఎంతో గొప్ప అనుభూతి. నా క్రికెట్ ప్రయాణంలో మర్చిపోలేని దశ సమయంలో ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. భారత జట్టు టీ20 పప్రంచకప్ విజయంలో భాగమవ్వడం ద్వారా నా కల నిజమైంది. ఐసీసీ అవార్డు విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ప్రతిభావంతులతో కూడిన భారత క్రికెట్లో ఇది చాలా ముఖ్యమైన దశ. నాకు అవకాశాలు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచినందుకు జట్టు సభ్యలు, కోచింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు’ అని శాంసన్ వెల్లడించాడు. వరల్డ్‌కప్ హీరోగా ఐపీఎల్లో అడుగుపెట్టిన శాంసన్ మూడు మ్యాచుల్లో విఫలమైనా.. నాలుగో మ్యాచ్‌లో సెంచరీతో గర్జించాడు.
🚨 FINALLY SANJU SAMSON IS BACK.🚨
Recent innings:
52(29) today, 9(5), 7(7), 6(7), 89(46), 89(42), 97*(50)Samson lights up his first innings for CSK with a blazing fifty, reaching the milestone in just 26 balls — pure class and fearless intent! 😬pic.twitter.com/vcKqizw6dx
— Sam (@Cricsam01) April 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

