Salman Butt: 24 గంటల్లోనే ముగిసిన కథ.. పాక్ మాజీ సారథిని కీలక పదవి నుంచి తప్పించిన పీసీబీ
Salman Butt: పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా సల్మాన్ భట్ ఎంపికపై బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. ఒక కళంకితుడికి సెలక్షన్ కమిటీ కన్సల్టంట్ పదవి ఎలా ఇస్తారని, దీనిద్వారా పాకిస్తాన్ క్రికెట్‌కు ఏం సందేశం ఇవ్వనున్నారని విమర్శలు గుప్పించాడు.
Salman Butt: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల కాలంలో ఏ నిర్ణయం తీసుకున్నా అదికాస్తా సంచలనమౌతోంది. ఇటీవలే పీసీబీ.. సెలక్టర్లతో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, కోచింగ్ సిబ్బందిని మార్చిన విషయం తెలిసిందే. సెలక్షన్ కమిటీలో వహబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేయగా కమ్రాన్ అక్మల్, అంజుమ్‌లను సభ్యులుగా నియమించారు. అయితే శనివారం వహబ్ తన కన్సల్టంట్గా పాక్ మాజీ సారథి సల్మాన్ భట్‌ను నియమించుకోవడం వివాదాస్పదమైంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని సెలక్షన్ కమిటీలోకి ఎలా తీసుకుంటారని మాజీలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా అయితే సల్మాన్ భట్ ఎంపికపై బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. ఒక కళంకితుడికి సెలక్షన్ కమిటీ కన్సల్టంట్ పదవి ఎలా ఇస్తారని, దీనిద్వారా పాకిస్తాన్ క్రికెట్‌కు ఏం సందేశం ఇవ్వనున్నారని విమర్శలు గుప్పించాడు. రమీజ్ రాజాతో పాటు మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో పీసీబీ కూడా వెనక్కి తగ్గింది. అతడిని చీఫ్ సెలక్టర్ కన్సల్టెంట్ పోస్టు నుంచి తప్పించింది. ఇదే విషయమై వహబ్ రియాజ్ స్పందిస్తూ.. “చాలామంది నా గురించి భట్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. భట్‌ను సెలక్షన్ కమిటీలోకి తీసుకోవాలనుకోవడం నా నిర్ణయమే. అతడికి ఉన్న క్రికెట్ నాలెడ్జ్ పై నాకు అవగాహన ఉంది గనకే భట్‌ను ఆ పదవిలోకి తీసుకున్నాం. నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను..” అని తెలిపాడు.
అఫ్గాన్ టీమ్ బ్యాటింగ్ కన్సల్టంట్గా..?
పీసీబీ అతడిని పదవి నుంచి తప్పించినా పాక్ పొరుగు దేశం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు భట్‌కు బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే భారత పర్యటనకు రానున్న ఆ జట్టు తమ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా భట్‌ను నియమించనున్నట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

