Sachin Tendulkar | మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. క్రికెట్ నుంచి వైదొలిగినా.. సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు చేరువయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఉల్లాస భరితమైన వీడియోను ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్రత్యేకమైన స్కిల్స్ ఉపయోగించిన వీడియో అది. మహారాష్ట్రలో టీ-20 లోకల్ టోర్నమెంట్.. పురందర్ ప్రీమియర్ లీగ్‌లో తమాషాగా హావభావాలు ప్రకటిస్తున్న దృశ్యం కనిపిస్తుంది.
వైడ్ బాల్ అని చేతులూపి చెప్పడానికి బదులు తలను నేలపై మోపి పాదాలను బ్యాలెన్స్ చేస్తూ వైడ్ బాల్ అని సంకేతాలిచ్చాడు ఆ అంపైర్. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందుకు ఇంటర్నేషనల్ అంపైర్ బిల్లీ బౌడెన్ వీడియోను ట్యాగ్ చేశారు. ఆయన తన క్రికెట్ కెరీర్లో విభిన్నమైన హవభావాలు ప్రదర్శించారు. కనుక మీరు కూడా వీడియోను చూసి ఎంజాయ్ చేసేయండి..Watch the hilarious video: https://twitter.com/sachin_rt/status/1470366195048013831