ముంబై: ప్రపంచ క్రీడారంగంలో అత్యధికంగా ఆరాధించే వ్యక్తుల్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్ మూడో స్థానంలో నిలిచాడు. ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ యూగోవ్.. 38 దేశాల్లో 42 వేల మందితో నిర్వహించిన సర్వేలో ఓవరాల్‌గా 12వ స్థానంలో నిలిచిన సచిన్.. క్రీడా రంగంలో సాకర్ స్టార్స్ లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టి సచిన్ ముందుండటం విశేషం.